లాక్‌డౌన్, కంటైన్‌మెంట్ నిబంధనలను కట్టుదిట్టంగా అమలు చేయడం వల్ల సత్ఫలితాలు వస్తున్నాయని... ప్రజలు ఇదే స్ఫూర్తితో ప్రభుత్వానికి సహకరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు. ప్రగతిభవన్‌లో కొవిడ్‌పై వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డితో కలిసి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
'వైరస్ తగ్గేవరకు ప్రజలు ఇదే స్ఫూర్తితో ఉండాలి' - cm kcr pressmeet with officials
రాష్ట్రంలో కరోనా పూర్తిస్థాయిలో తగ్గుముఖం పట్టేవరకు ప్రస్తుత పంథానే పకడ్బందీగా కొనసాగించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ప్రజలు ఇదే స్ఫూర్తితో సర్కారుకు సహకరించాలని ఆయన కోరారు.
!['వైరస్ తగ్గేవరకు ప్రజలు ఇదే స్ఫూర్తితో ఉండాలి' cm kcr pressmeet with officials](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6942836-thumbnail-3x2-kcr.jpg)
'వైరస్ తగ్గేవరకు ప్రజలు ఇదే స్ఫూర్తితో ఉండాలి'
కరోనా నియంత్రణలో ప్రభుత్వం చేస్తున్న కృషిని కేంద్రానికి నివేదించడంతో పాటు అవసరమైన సహకారం కోరదామని ఈ సందర్భంగా సీఎం పేర్కొన్నారు. రేపు ప్రధాని మోదీ నిర్వహించనున్న దృశ్యమాధ్యమ సమీక్షలో కరోనా నియంత్రణకు రాష్ట్రాలకు అవసరమైన నిధులివ్వడం, ఎఫ్ఆర్బీఎం నిధుల సడలింపు తదితర అంశాలపై గురించి ముఖ్యమంత్రి ప్రస్తావించనున్నారు.
ఇదీ చూడండి:ఐదు దశల్లో లాక్‌డౌన్ ఎత్తివేత- రూల్స్ ఇవే...