తెలంగాణ

telangana

ETV Bharat / state

కామన్​వెల్త్ గేమ్స్ పతక విజేతలకు సీఎం కేసీఆర్ అభినందనలు - పీవీసింధు

CM KCR Wishes: కామన్​వెల్త్​ క్రీడల్లో బంగారు పతకాలు సాధించిన పీవీసింధు, బాక్సర్​ నిఖత్ జరీన్​కు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ అభినందనలు తెలిపారు. ప్రపంచ వేదికపై మరోసారి సత్తా చాటారని కొనియాడారు.

CM KCR
CM KCR

By

Published : Aug 8, 2022, 6:18 PM IST

CM KCR Wishes: కామన్​వెల్త్​ క్రీడల్లో స్వర్ణ పతకాలు సాధించిన పీవీసింధు, బాక్సర్​ నిఖత్ జరీన్​కు సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్ అభినందనలు తెలిపారు. మరోసారి ప్రపంచ వేదికపై మన క్రీడాకారులు సత్తా చాటారని ప్రశంసించారు. రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పతకాలు సాధించిన క్రీడాకారులను అభినందించారు.

అలాగే టేబుల్ టెన్నిస్​ మిక్స్​డ్​ డబుల్స్​లో స్వర్ణం సాధించిన అచంట శరత్ కమల్, శ్రీజ ఆకులకు మంత్రి కేటీఆర్ అభినందనలు తెలియజేశారు. పురుషుల బ్యాడ్మింటన్​ సింగిల్స్​లో బంగారు పతకం సాధించిన లక్ష్యసేన్​కు మంత్రి కేటీఆర్ ట్విటర్​లో అభినందించారు.

ABOUT THE AUTHOR

...view details