ఆకుపచ్చ తెలంగాణ ఏర్పాటే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఈ నెల 25వ తేదీన అమీర్పేట సత్యం థియేటర్ వద్ద మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్... మొక్కలు నాటి హరిత హారం కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని తలసాని తెలిపారు.
సీఎం ఆదేశాల మేరకు గురువారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా హరితహారం ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో 2.50 కోట్లు, హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో 5 కోట్ల మొక్కలను నాటేందుకు ప్రణాళికలను సిద్ధం చేసినట్లు వివరించారు.