రెవెన్యూ బిల్లుపై మాట్లాండేందుకు ప్రతిపక్షాలకు తగిన సమయం కేటాయించాలని ముఖ్యమంత్రి కేసీఆర్... సభాపతి పోచారంను కోరారు. శుక్రవారం వరకు సమయం ఉందని... దీనిపై నిపుణులతో చర్చించండి అంటూ ప్రతిపక్షాలకు సీఎం సూచించారు. చర్చల్లో భాగంగా సూచనలు ఇస్తే స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు.
ప్రతిపక్షాల గొంతునొక్కితే మాకేమొస్తది: కేసీఆర్ - ముఖ్యమంత్రి కేసీఆర్ వార్తలు
ప్రతిపక్షాల గొంతునొక్కితే మాకేమి వస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారు. సభ్యుల సంఖ్య ఆధారంగా సమయం కేటాయిస్తారనే విషయం గుర్తుంచుకోవాలన్నారు. రెవెన్యూ బిల్లుపై మాట్లాడేందుకు ప్రతిపక్షాలకు తగిన సమయం కేటాయించాలని స్పీకర్ను కోరారు.

ప్రతిపక్షాల గొంతునొక్కితే మాకేమి వస్తుంది: కేసీఆర్
ప్రతిపక్షాల గొంతునొక్కితే మాకేమి వస్తుంది: కేసీఆర్
ప్రతిపక్షాల గొంతునొక్కితే మాకేమి వస్తుందని కేసీఆర్ ప్రశ్నించారు. అసెంబ్లీలో మాకే ఎక్కువ సభ్యులున్న పెద్దగొంతు ఉందన్నారు. సభ్యుల సంఖ్య ఆధారంగా సమయం కేటాయిస్తారని... ఈ విషయం అందరూ గుర్తించుకోవాలని సూచించారు. శాసనసభ నియమ, నిబంధనల ప్రకారం నిర్వహణ ఉంటుందని కేసీఆర్ పేర్కొన్నారు.
ఇదీ చూడండి:కార్పొరేట్ ఆస్పత్రుల దందా అరికడతాం: కేసీఆర్