తెలంగాణ

telangana

ETV Bharat / state

పీవీకి అభిమానులెక్కువ.. ఘనంగా నిర్వహించండి: కేసీఆర్​

రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పీవీ శత జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. సంవత్సరం పొడవునా జరిగే ఉత్సవాల్లో అందరూ పాల్గొనాలన్నారు. వేడుకల కోసం రూ.10 కోట్లు విడుదల చేసినట్లు వెల్లడించారు.

cm kcr about pv narasimha rao
పీవీకి అభిమానులెక్కువ.. ఘనంగా నిర్వహించండి: కేసీఆర్​

By

Published : Jun 28, 2020, 12:59 PM IST

పీవీ శత జయంతి ఉత్సవాల కోసం రూ.10 కోట్లు విడుదల చేసినట్లు ముఖ్యమంత్రి కేసీఆర్​ వెల్లడించారు. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఉత్సవాలను నిర్వహించాలన్నారు. నరసింహరావు శత జయంతి వేడుకల సందర్భంగా పీవీ ఘాట్​లో సీఎం మాట్లాడారు.

పీవీకి చాలా దేశాల్లో అభిమానులు ఉన్నారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఉత్సవ కమిటీలో ఉంటామని విదేశాల నుంచి ఆసక్తి చూపుతున్నారని తెలిపారు. బిల్‌ క్లింటన్‌ సహా ప్రపంచ నేతలతో ఆయనకు సంబంధాలున్నాయని గుర్తు చేశారు.

ఏడాది పొడవునా జరిగే నరసింహరావు జయంతి ఉత్సవాల్లో అందరూ పాల్గొనాలని సీఎం పిలుపునిచ్చారు. ఉత్సవాలకు ప్రణబ్‌ ముఖర్జీ, మన్మోహన్‌ సహా అందరినీ ఆహ్వానిస్తామని తెలిపారు. వేడుకల్లో పాల్గొనేందుకు ప్రపంచ వ్యాప్తంగా ఆహ్వానిస్తున్నామన్నారు. ఉత్సవాల ముగింపు సభ లక్ష మందితో జరగాలని కోరుకుంటున్నట్లు సీఎం వివరించారు.

ఇదీచూడండి: 'పీవీ.. భరతమాతకు గర్వకారణమైన పుత్రరత్నం'

ABOUT THE AUTHOR

...view details