పీవీ బహుముఖ ప్రజ్ఞాశాలి, బహుభాషా కోవిదుడని ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) కొనియాడారు. ఆయనను ఎంత గౌరవించుకున్నా తక్కువేనన్నారు. ఏడాది కాలంగా పీవీ జయంత్యుత్సవాలు జరుపుకుంటున్నామని... వాటిని విజయవంతంగా నిర్వహించిన కేశవరావుకు అభినందనలు తెలిపారు.
''పీవీ ఒక కీర్తి శిఖరం, దీప స్తంభం. నవోదయ విద్యాలయాలు, గురుకులాలు పీవీ తీసుకొచ్చినవే. నవోదయ, గురుకులాల ఫలాలను సమాజం అందుకుంటోంది. పీవీ విద్యానిధి, సాహిత్య పెన్నిధి. ఆయన నిరంతర సంస్కరణవాది. సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకోగల నిష్ణాతుడు ఆయన. ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకునేలా భూసంస్కరణలు తెచ్చారు. ప్రజల కోసం స్వయంగా తన 800 ఎకరాల భూమిని ప్రజలకు ఇచ్చారు. అనేక ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి... మైనార్టీ ప్రభుత్వాన్ని ఐదేళ్లు పూర్తిగా నడిపారు. మన్మోహన్ ప్రధానిగా ఉన్నప్పుడు అనేకసార్లు పీవీ సేవలు స్మరించుకున్నారు. మన్మోహన్‌సింగ్ స్వయంగా నాతో పీవీ గొప్పతనం గురించి ప్రస్తావించారు.''