తెలంగాణ

telangana

ETV Bharat / state

కార్పొరేట్ ఆస్పత్రుల దందా అరికడతాం: కేసీఆర్‌ - ప్రైవేటు ఆస్పత్రులపై కఠిన చర్యలు

కరోనా చికిత్సకు అధిక ఛార్జీలు వసూలు చేయడం దారుణమని ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. అధిక ఛార్జీలు వసూలు చేసే ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కార్పొరేట్ ఆస్పత్రులపై అధికారులతో టాస్క్‌ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.

cm kcr about private hospitals in telangana assembly mansson session
కార్పొరేట్ ఆస్పత్రులపై అధికారులతో టాస్క్‌ఫోర్స్ కమిటీ: కేసీఆర్

By

Published : Sep 9, 2020, 4:20 PM IST

Updated : Sep 9, 2020, 4:34 PM IST

కరోనా చికిత్సకు ప్రైవేటు ఆస్పత్రులు అధికంగా ఛార్జీలు వసూలు చేస్తున్నాయని... వాటిని అరికట్టాలని భట్టి విక్రమార్క చేసిన సూచనను కేసీఆర్ అభినందిచారు. కరోనా చికిత్సకు అధిక ఛార్జీలు వసూలు చేయడం దారుణమంటూ వ్యాఖ్యానించారు. ప్రెవేటు ఆస్పత్రి మీద కచ్చితంగా నిఘా పెడతామని కేసీఆర్... భట్టికి హామీ ఇచ్చారు.

''డబ్బులు అంత దుర్మార్గంగా సంపాదించి ఏమి చేసుకుంటారో నాకు అర్థం కావట్లేదు. బాధ కూడా కలుగుతోంది. విపత్కర సమయంలో వాళ్ల బాధ్యతను మరిచి... శవాన్ని దగ్గర ఉంచుకుని గందరగోళం చేస్తూ... లక్షల్లో వసూలు చేయడం ధర్మం కాదు. భట్టి విక్రమార్కకు హామీ ఇస్తున్న ఈ ప్రైవేటు ఆస్పత్రుల్లో అధిక ఛార్జీలు వసూలు చేసే ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకుంటాం. దాని వెనుక ఎవరున్న సహించేది లేదు.''

కేసీఆర్, ముఖ్యమంత్రి

కార్పొరేట్ ఆస్పత్రులపై అధికారులతో టాస్క్‌ఫోర్స్ కమిటీ: కేసీఆర్

లోకమంతా అల్లాడిపోతుంటే.. ఈ సమయంలో డబ్బులు సంపాందించేందుకు ఇదే దొరికందా అంటూ కేసీఆర్ మండిపడ్డారు. కార్పొరేట్ ఆస్పత్రులపై అధికారులతో టాస్క్‌ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. టాస్క్​ఫోర్స్ కమిటీ తీసుకున్న చర్యలను ప్రతిపక్ష నేతలకు పంపించాలని సంబంధిత శాఖకు సూచించారు. విపక్షాల నుంచి నిర్మాణాత్మక సూచనలు తీసుకునేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని కేసీఆర్ తెలిపారు.

ఇదీ చూడండి:'ప్రభుత్వాన్ని ఇరుకులో పెట్టాలనే ధోరణి మానుకోవాలి'

Last Updated : Sep 9, 2020, 4:34 PM IST

ABOUT THE AUTHOR

...view details