CM Jagan Flight Emergency landing: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దిల్లీ వెళ్లే విమానం సాంకేతిక లోపంతో అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే గన్నవరం విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండింగ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. సాయంత్రం 5.03 గంటలకు బయలు దేరిన విమానం.. 5.26 గంటలకు అత్యవసరంగా ల్యాండ్ అయినట్లు సమాచారం. విమానం ఏసీ వాల్వ్‌లో లీకేజీ వల్ల సమస్య ఏర్పడినట్లు సీఎంవో అధికారులు తెలిపారు. సమస్యను గుర్తించిన పైలట్ విమానాన్ని వెనక్కి మళ్లించారని చెప్పారు. దీంతో దిల్లీ వెళ్లాల్సిన జగన్.. గన్నవరం విమానాశ్రయ లాంజ్‌లో కాసేపు వేచి చూశారు.
ఏపీ సీఎం జగన్ ప్రయాణిస్తున్న విమానం అత్యవసర ల్యాండింగ్.. ప్రత్యేక విమానం ఏర్పాటు - సీఎం ప్రయాణిస్తున్న విమానం అత్యవసర ల్యాండింగ్
CM Jagan Flight Emergency landing: ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రయాణిస్తున్న విమానం అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ల్యాండింగ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. రేపు దిల్లీలో జరిగే ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్‌లో జగన్ పాల్గొనాల్సి ఉంది. సీఎం జగన్ దిల్లీ వెళ్లేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
సీఎం జగన్ దిల్లీ వెళ్లేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇందుకోసం ప్రత్యేక విమానాన్ని విమానాశ్రయ అధికారులు సిద్ధం చేశారు. సీఎం జగన్ వెంట ఉన్నతాధికారుల బృందం దిల్లీ వెళ్లనుంది. దిల్లీ చేరుకున్న తర్వాత జగన్.. రాత్రికి 1 జనపథ్ నివాసంలో బస చేయాల్సి ఉంది. ముఖ్యమంత్రి వెంట సీఎస్ జవహార్ రెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి, అధికారులు పూనం మాలకొండయ్య, కృష్ణ మోహన్‌రెడ్డి, చిదానందరెడ్డి ఉన్నారు. రేపు ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకూ దిల్లీలోని లీలా ప్యాలెస్ హోటల్‌లో దౌత్యవేత్తలతో జరగనున్న ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్‌లో జగన్ పాల్గొనాల్సి ఉంది.
ఇవీ చదవండి: