తిరుమల పర్యటనలో రెండోరోజు కర్ణాటక సీఎం యడియూరప్పతో కలిసి ఏపీ ముఖ్యమంత్రి జగన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ముందుగా శ్రీవారి ఆలయం చేరుకున్న సీఎం జగన్.. మహాద్వారం వద్ద యడియూరప్పకు స్వాగతం పలికారు. నాద నీరాజనం వేదికగా జరిగిన సుందరకాండ పారాయణంలో ఇద్దరు ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. అనంతరం రంగనాయక మండపంలో ఏపీ, కర్ణాటక సీఎంలకు వేద పండితులు ఆశీర్వచనం పలికారు. కర్ణాటక సీఎం యడియూరప్పకు సీఎం జగన్ శ్రీవారి శేష వస్త్రం బహూకరించారు. వారిద్దరికి తితిదే ఈవో అనిల్ కుమార్ సింఘాల్, ఛైర్మన్ సుబ్బారెడ్డి తీర్ధప్రసాదాలు అందజేశారు.
కర్ణాటక సత్రాల భవన నిర్మాణానికి ముఖ్యమంత్రుల భూమిపూజ - జగన్ తిరుమల పర్యటన తాజా అప్ డేట్స్
తిరుమల పర్యటనలో రెండోరోజు కర్ణాటక సీఎం యడియూరప్పతో కలిసి ఏపీ ముఖ్యమంత్రి జగన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. నాద నీరాజనం వేదికగా జరిగిన సుందరకాండ పారాయణంలో ఇద్దరు ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. తిరుమలలో కర్ణాటక సత్రాల భవన నిర్మాణ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం తాడేపల్లికి బయలుదేరారు.
కర్ణాటక సత్రాల భవన నిర్మాణానికి భూమిపూజ చేసిన ఏపీ, కర్ణాటక సీఎంలు
అనంతరం తిరుమలలో కర్ణాటక సత్రాల భవన నిర్మాణ పూజా కార్యక్రమంలో ఇరువురు ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. ఇక్కడ రూ. 200 కోట్లతో కర్ణాటక ప్రభుత్వం వసతి గృహ సముదాయాలు నిర్మించనుంది. రోజుకు 18 వందల మంది బసకు వీలుగా గృహ సముదాయాల నిర్మాణం చేపట్టనున్నారు. తిరుమల పర్యటన ముగిసిన అనంతరం సీఎం జగన్ తాడేపల్లి బయల్దేరారు.
ఇవీ చదవండి: 'హైదరాబాద్-విజయవాడ హైవే వెంబడి రైల్వే లైను కోరాం'