మంచి చదువుతోనే పేదల బతుకులు మారతాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ అన్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జగనన్న విద్యా దీవెన పథకం ప్రారంభించిన ఆయన.. వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్లు, విద్యార్థుల తల్లులతో మాట్లాడారు. విద్యాదీవెనలో భాగంగా 2 పథకాలు తీసుకొచ్చామన్న సీఎం.. విద్యార్థులకు బోర్డింగ్, లాడ్జింగ్, పూర్తి రీయింబర్స్మెంట్ ఇస్తామని తెలిపారు.
పిల్లలకు మనం ఇవ్వగలిగే ఒకే ఒక్క ఆస్తి చదువే: సీఎం జగన్ - fee reimbursement scheme news
పిల్లలకు మనం ఇవ్వగలిగే ఒకే ఒక్క ఆస్తి చదువేనని ఏపీ ముఖ్యమంత్రి జగన్ అన్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జగనన్న విద్యాదీవెన పథకాన్ని ఆయన ప్రారంభించారు. ఒక్క పైసా కూడా బకాయిలు లేకుండా ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తామని సీఎం తెలిపారు. కళాశాలల్లో సదుపాయాలు లేకపోతే 1902కు ఫోన్ చేయాలని తల్లులకు ముఖ్యమంత్రి సూచించారు.
పిల్లలకు మనం ఇవ్వగలిగే ఒకే ఒక్క ఆస్తి చదువే: సీఎం జగన్
పిల్లలకు మనం ఇవ్వగలిగే ఆస్తి.. ఒక్క చదువేనన్న సీఎం.. మార్చి 31 వరకు ఉన్న పూర్తి బకాయిలను చెల్లిస్తామని పేర్కొన్నారు. 2018 – 19 లో గత ప్రభుత్వం పెట్టిన రూ.1880 కోట్లు, ఈ ఏడాదికి సంబంధించి ఒక్క పైసా కూడా బకాయి లేకుండా ఇస్తామని స్పష్టం చేశారు. 2020 – 21లోనూ ప్రతి త్రైమాసికం తర్వాత తల్లుల ఖాతాలో డబ్బులు వేస్తామని సీఎం జగన్ వెల్లడించారు. కళాశాలల్లో సదుపాయాలు లేకపోతే 1902కు తల్లులు ఫోన్ చేయవచ్చని ముఖ్యమంత్రి తెలిపారు.