ఆంధ్రప్రదేశ్లో ఇసుక తవ్వకం, సరఫరాల్లో ఎక్కడా అవినీతికి తావు ఉండొద్దని ఏపీ సీఎం జగన్ స్పష్టం చేశారు. ఇసుక నూతన విధానంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇసుక విధానం పారదర్శకతో పాటు... ధర కూడా తక్కువ ఉండాలని అధికారులను ఆదేశించారు. వినియోగదారులకు నాణ్యమైన ఇసుకే సరఫరా చేయాలన్నారు.
ఆంధ్రాలో నియోజకవర్గాల వారీగా ఇసుక ధర: ఏపీ సీఎం జగన్ - ఏపీ సీఎం జగన్ తాజా వార్తలు
ఏపీలో ఇసుక నూతన విధానంపై ఆ రాష్ట్ర సీఎం జగన్ అధికారులతో సమీక్షించారు. వినియోగదారులకు నాణ్యమైన ఇసుకే సరఫరా చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. నియోజకవర్గాలు, ప్రాంతాలవారీగా ఇసుక ధర నిర్ధరణ జరగాలన్నారు.
ఇసుక రీచ్‌ల సామర్థ్యం పెంచితే పెద్ద కంపెనీలు వస్తాయన్న జగన్... ఎవరైనా వచ్చి చలానా కట్టి ఇసుక తీసుకెళ్లేలా విధానం ఉండాలని సూచించారు. నియోజకవర్గాలు, ప్రాంతాలవారీగా ఇసుక ధర నిర్ధరణ జరగాలన్నారు. అంతకంటే ఎక్కువ ధరకు విక్రయిస్తే ఎస్‌ఈబీ పర్యవేక్షణ చేస్తుందని చెప్పారు. ప్రభుత్వ నిర్మాణాలు, బలహీనవర్గాల ఇళ్లకు రాయితీపై ఇసుక సరఫరా చేయాలని దిశానిర్దేశం చేశారు. నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న గ్రామాలకు ఎన్ని కిలోమీటర్ల పరిధి వరకు సబ్సిడీ ధరపై ఇసుక సరఫరా చేయవచ్చనే విషయాన్ని పరిశీలించాలని ఆదేశించారు.
ఇదీ చదవండిఃతెదేపా రాష్ట్ర అధ్యక్షుడిగా అచ్చెన్న.. పొలిట్ బ్యూరోలోకి బాలకృష్ణ