AP CM YS Jagan slams opposition : కొవిడ్ కారణంగా రెండు సంవత్సరాలుగా.. విద్యార్థుల పరీక్షలు నిర్వహించలేకపోయామని.. ఇలాంటి పరిస్థితుల్లో ఉపాధ్యాయులు పోరుబాట పట్టడం మంచిదికాదని.. ఏపీ ముఖ్యమంత్రి జగన్ అన్నారు. ఉపాధ్యాయుల్ని ప్రతిపక్షాలే రెచ్చగొడుతున్నాయని ఆరోపించారు.
ప్రతిపక్షాలకు పండగే...
జగనన్న చేదోడు పథకం రెండో విడత నిధుల విడుదల కార్యక్రమంలో మాట్లాడిన ఏపీ సీఎం.. ప్రతిపక్షాల తీరును తప్పుబట్టారు. అమరావతిలో పేదలకు భూములు కేటాయిస్తే అడ్డుకున్నారని విమర్శించారు. ఉద్యోగులు సమ్మెకు వెళ్లాలని ఎవరూ కోరుకోవట్లేదని.. కానీ అలా జరిగితే ప్రతిపక్షాలకు పండుగే అని దుయ్యబట్టారు. ఉద్యోగులు సమ్మెలో పాల్గొనట్లేదని తెలిసి ప్రతిపక్షాలు నిరాశ చెందాయంటూ సెటైర్లు విసిరారు.
"ఉద్యోగులు సమ్మెకు వెళ్లాలని ఎవరూ కోరుకోవట్లేదు. అలా సమ్మెలోకి వెళ్తే ప్రతిపక్షాలకు పండుగే. ఉద్యోగులు సమ్మెలో పాల్గొనట్లేదని తెలిసి నిరాశ చెందారు. కమ్యూనిస్టులు ఉద్యోగులను ముందుంచి ఆందోళన చేయిస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కమ్యూనిస్టుల ఆందోళనలు చేస్తున్నారు. రాజకీయాలను కలుషితం చేసి విచ్ఛిన్నం చేసేందుకు యత్నిస్తున్నారు" -జగన్, ఏపీ ముఖ్యమంత్రి
ఇదీ చూడండి :మోదీ వ్యాఖ్యల ఎఫెక్ట్: భాజపా కార్యాలయ ముట్టడికి కాంగ్రెస్ శ్రేణుల యత్నం