తెలంగాణ

telangana

ETV Bharat / state

AP Local Body Elections: 'ఈ విజయంతో మరింత బాధ్యత పెరిగింది' - ap local body election results 2021

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో (andhra pradesh local body election results) ఘనవిజయాన్ని అందించిన ప్రజలకు ముఖ్యమంత్రి జగన్​ ధన్యవాదాలు తెలిపారు. ఈ విజయంతో నాపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. పరిషత్‌ ఎన్నికల ఫలితాల (andhra pradesh local body election resultsపై జగన్​ మీడియా సమావేశం నిర్వహించారు.

AP Local Body Elections
విజయంపై జగన్ స్పందన

By

Published : Sep 20, 2021, 3:37 PM IST

ఏపీలో పరిషత్‌ ఎన్నికల్లో(andhra pradesh local body election results) అధికార పార్టీ వైకాపా (Ruling party ycp)సునాయాసంగా గెలుపొందింది. అన్ని ప్రాంతాల్లోనూ... వైకాపా జెండా రెపరెపలాడింది. ప్రతిపక్ష తెలుగుదేశం(Opposition party tdp) ఎన్నికలను బహిష్కరించగా.. కొన్నిచోట్ల ఆ పార్టీకి చెందిన అభ్యర్థులు పోటీలో నిలిచారు. ఏపీలో మొత్తం 660 జడ్పీటీసీ స్థానాలుండగా.. వాటిలో 126 స్థానాలు వైకాపాకు ఏకగ్రీవమయ్యాయి. అభ్యర్థులు చనిపోవడంతో 11 చోట్ల, ఇతర కారణాలతో 8 చోట్ల ఎన్నికలు నిర్వహించలేదు. 515 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. మొత్తం 10,047 ఎంపీటీసీ స్థానాల్లో 2,371 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి (Unanimous). అభ్యర్థులు చనిపోవడంతో 81 చోట్ల, ఇతర కారణాల వల్ల 376 చోట్ల ఎన్నికలు జరగలేదు. 7,220 ఎంపీటీసీలకు ఎన్నికలు నిర్వహించారు.

పరిషత్‌ ఎన్నికల ఫలితాల(andhra pradesh local body election results) పై ముఖ్యమంత్రి జగన్ (Andhra Pradesh CM Jagan)​ స్పందించారు. ఈ విజయంతో నాపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. ప్రజలందరి చల్లని దీవెనలతోనే ఈ అఖండ విజయం వరించిందన్నారు.

ప్రభుత్వానికి తోడుగా ఉన్న ప్రజలకు రుణపడి ఉంటా. ఎన్నికలు (andhra pradesh local body elections) ఆపేందుకు చాలామంది కుట్రలు పన్నారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా ప్రజలు మావైపు ఉన్నారు. ఈ విజయాన్ని అందించిన ప్రజలకు ధన్యవాదాలు.ఈ విజయంతో నాపై మరింత బాధ్యత పెరిగింది.

- ఏపీ ముఖ్యమంత్రి జగన్

ప్రజలంతా ప్రభుత్వానికి తోడుగా నిలబడ్డారన్న జగన్ (Andhra Pradesh CM Jagan)​ ​.. ఈ విజయాన్ని అందించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. పరిషత్‌ ఎన్నికల ఫలితాలపై సీఎం జగన్​ మీడియా సమావేశం నిర్వహించారు.

ఇదీ చదవండి:ZPTC-MPTC Results: ఏపీ పరిషత్‌ ఎన్నికల్లో అధికార వైకాపా సునాయాస విజయం

ABOUT THE AUTHOR

...view details