ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా పులివెందుల పట్టణ శివారులోని ఎన్‌ఎస్‌ఎల్ టెక్స్‌టైల్స్ సమీపంలోని స్థలంలో అపాచి షూ కంపెనీ నిర్మాణానికి ముఖ్యమంత్రి జగన్ గురువారం శంకుస్థాపన చేశారు. అపాచీ ప్రతినిధులతో కలిసి మొక్కలు నాటిన ఆయన... 70 కోట్ల రూపాయలతో రెండు దశల్లో ఏర్పాటు చేయనున్న ఈ పరిశ్రమ ద్వారా 2 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. త్వరలో శ్రీకాళహస్తిలోనూ అపాచీ పరిశ్రమ రానుందన్నారు. 18 లక్షల జతల షూస్ ఉత్పత్తి చేయాలని భావిస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు.
పులివెందులలో అపాచి... ప్రారంభించిన సీఎం - సీఎం జగన్ కడప పర్యటన వార్తలు
ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా పులివెందుల పట్టణ శివారులో అపాచి షూ కంపెనీ నిర్మాణానికి ముఖ్యమంత్రి జగన్ గురువారం శంకుస్థాపన చేశారు. సంస్థ విజయవంతంగా నడిచేందుకు సహకరిస్తానని భరోసా ఇచ్చారు.
పులివెందులలో అపాచి... ప్రారంభించిన సీఎం
మరోవైపు ఏపీలో గుజరాత్‌కు చెందిన ప్రతిష్టాత్మక ఇర్మా సంస్థ ఏర్పాటుకు సీఎం సమక్షంలో ఒప్పందం కుదిరింది. పులివెందులలోని ఏపీ కార్ల్ వద్ద ఇది ఏర్పాటు కానుంది.
ఇదీ చదవండి:క్రిస్మస్ వేడుకల్లో 'మెగా' కజిన్స్