ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పదేపదే అడగడం తప్ప చేసేదేమీ లేదని పేర్కొన్నారు. దిల్లీలో ఉన్నది సంకీర్ణ ప్రభుత్వం కాదన్నారు. కిందటి ప్రభుత్వం ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టిందని తెలుగుదేశం పార్టీపై విమర్శలు గుప్పించారు.
ప్రత్యేక హోదా: 'పదేపదే అడగడం తప్ప చేసేదేమీ లేదు' - AP Latest News
ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో ఆ రాష్ట్ర సీఎం జగన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. కేంద్ర ప్రభుత్వాన్ని పదేపదే అడగడం తప్ప చేసేదేమీ లేదని స్పష్టం చేశారు. ఈ పరిస్థితికి కారణం కిందటి ప్రభుత్వమేనని వ్యాఖ్యానించారు. దేవుడి దయతో ఎప్పుడో ఓ సారి మంచి జరుగుతుందని అనుకుంటున్నానని పేర్కొన్నారు.
జగన్, ఏపీ సీఎం
ప్యాకేజీ కోసం రాజీపడిందని ఆరోపించారు. అందుకే దిల్లీ వెళ్లిన ప్రతిసారి ప్రత్యేకహోదా ఇవ్వాలని అడగాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. దేవుడి దయతో ఎప్పుడో ఓసారి మంచి జరుగుతుందని అనుకుంటున్నానని వ్యాఖ్యానించారు. జాబ్ క్యాలెండర్ విడుదల సందర్భంగా సీఎం జగన్ ఈ కామెంట్స్ చేశారు.
ఇదీ చదవండి:Ts Lockdown: రాష్ట్రంలో లాక్డౌన్ ఇక ఉండదా? అయితే వాట్ నెక్స్ట్