CM Jagan Kadapa Tour Cancel: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కడప పర్యటన రద్దైంది. అమీన్‌పీర్ పెద్ద దర్గా ఉరుసు మహోత్సవాలతోపాటు.. ఆర్టీసీ చైర్మన్ మల్లికార్జునరెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్‌కు ముఖ్యమంత్రి హాజరుకావాల్సి ఉంది. ఆమేరకు అధికారులు ఏర్పాట్లు కూడా చేశారు. ఐతే గన్నవరంతోపాటు, కడప విమానాశ్రయాల్లోనూ పొగమంచు ఎక్కువగా ఉందని అధికారులు సమాచారం ఇవ్వడంతో.. జగన్ పర్యటన రద్దు చేసుకున్నారు. అంబేడ్కర్ వర్థంతి సందర్భంగా సీఎం జగన్ నివాళులర్పించారు. సీఎం నివాసంలో మంత్రులతో కలిసి అంబేడ్కర్ చిత్రపటానికి నివాళులు అర్పించారు.
ఏపీ సీఎం కడప పర్యటన రద్దు.. ఎందుకంటే..? - andhra pradesh latest news
Jagan Kadapa Tour Cancel: ఏపీ ముఖ్యమంత్రి జగన్ కడప పర్యటన రద్దైంది. విమానాశ్రయాల్లో పొగమంచు కారణంగా జగన్ తన పర్యటనను క్యాన్సిల్ చేసుకున్నారు.
Jagan Kadapa Tour Cancel