ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ బెంజ్ సర్కిల్లో సీఎం జగన్ చేతుల మీదుగా.. రేషన్ సరకుల పంపిణీ వాహనాలు ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి 1 నుంచి ఇంటి వద్దకే చౌక డిపో సరకులు పంపిణీ చేయనున్నారు. ఇప్పటికే ఈ విధానం శ్రీకాకుళం జిల్లాలో ప్రయోగాత్మకంగా అమలవుతోంది.
ఇంటింటికీ రేషన్ పంపిణీ వాహనాలు.. ప్రారంభించిన ఏపీ సీఎం - ap news
పేదలకు నిత్యావసర సరకులను నేరుగా ఇంటికే పంపిణీ చేసేందుకు అందుబాటులోకి తెచ్చిన రేషన్ పంపిణీ వాహనాలను ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు. విజయవాడ బెంజ్ సర్కిల్ వద్ద రేషన్ పంపిణీ వాహనాలకు పచ్చ జెండా ఊపారు.
ఇంటింటికీ రేషన్ పంపిణీ వాహనాలు.. ప్రారంభించిన ఏపీ సీఎం
539 కోట్ల రూపాయల వ్యయంతో.. 9,260 వాహనాలను ప్రభుత్వం కొనుగోలు చేసింది. నిరుద్యోగులకు 60 శాతం సబ్సిడీతో వాహనాలను అందజేశారు. ఒక్కో వాహనం ద్వారా రోజుకు సగటున 90 ఇళ్లకు సరుకులు పంపిణీ చేయనున్నారు.
ఇదీ చదవండి:మే 3 నుంచి ఇంటర్ పరీక్షలు..!