తెలంగాణ

telangana

ETV Bharat / state

కృష్ణాపై నిర్మించే ప్రాజెక్టుతో ఎవరికీ నష్టం జరగదు: ఏపీ సీఎం జగన్​ - ఏపీ తెలంగాణ మధ్య నీటి యుద్ధం

కృష్ణా నదిపై రాష్ట్ర ప్రభుత్వం నిర్మించనున్న ప్రాజెక్టుతో ఏ రాష్ట్రానికి నష్టం జరగదని ఏపీ సీఎం జగన్ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం 800 అడుగుల వద్దే ప్రాజెక్టులు చేపడుతోందని.. అదే లెవల్​లో తాము ప్రాజెక్టులు నిర్మిస్తామని జగన్ తెలిపారు.

cm-jagan-given-clarity-on-pothireddypadu-project
పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుతో ఏ రాష్ట్రానికి నష్టం జరగదు: ఏపీ సీఎం జగన్​

By

Published : May 26, 2020, 5:17 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని రాయలసీమ కరవు నివారణ కోసం ప్రాజెక్టులు చేపడుతున్నామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్​మోహన్​రెడ్డి అన్నారు. అయితే వీటిపై కొందరు వివాదాలు సృష్టిస్తున్నారని సీఎం ఆరోపించారు. 'మన పాలన - మీ సూచన' పేరిట రెండో రోజు జరిగిన మేథో మధన సదస్సులో ఆయన పాల్గొన్నారు.

శ్రీశైలంలో 796 అడుగుల వరకు తెలంగాణ వాళ్లు విద్యుత్‌ ఉత్పత్తి చేస్తున్నారని సీఎం అన్నారు. ఇలా అయితే రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు ఏ విధంగా నీళ్లు వస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి పరిష్కారం చూపించేందుకు 800 అడుగుల వద్ద 2 టీఎంసీలతో పంపులు ప్రారంభించే ప్రయత్నం చేస్తున్నామని వివరించారు. కృష్ణా నదిపై కట్టే ప్రాజెక్టుతో ఎవరికీ నష్టం జరగదని స్పష్టం చేశారు. తమకు కేటాయించిన నీటినే తీసుకుంటున్నామన్నారు. రాయలసీమ కరవు నివారణకు రూ.27 వేల కోట్లతో ప్రాజెక్టులు నిర్మిస్తామని సీఎం జగన్ తెలిపారు.

మరోవైపు పోలవరం నుంచి ప్రకాశం బ్యారేజ్‌కు 50 వేల క్యూసెక్కుల నీటిని తీసుకొచ్చేలా కెపాసిటీ పెంచుతామని వెల్లడించారు. దీనివల్ల రాష్ట్రమంతా సస్యశ్యామలం అవుతుందని జగన్ తెలిపారు.

పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుతో ఏ రాష్ట్రానికి నష్టం జరగదు: ఏపీ సీఎం జగన్​

ఇదీ చదవండి: ఈ నెల 29న కొండపోచమ్మ జలాశయం ప్రారంభం: హరీశ్

ABOUT THE AUTHOR

...view details