విదేశాలకు వెళ్లేందుకు... వీసా నిమిత్తం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బేగంపేటలోని అమెరికా కాన్సులేట్‌కి వెళ్లారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని స్వగృహం నుంచి బయలుదేరిన సీఎం జగన్... రోడ్డు మార్గం ద్వారా గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ వెళ్లారు. బేగంపేట విమానాశ్రయం చేరుకున్న జగన్... అక్కడ నుంచి నేరుగా అమెరికన్ కాన్సులేట్‌కు చేరుకొని వీసా పనులు పూర్తి చేసుకున్నారు. ఏపీ సీఎం జగన్ రేపు జెరూసలెం వెళ్తారు. అక్కడి పర్యటన అనంతరం... అమరావతి వచ్చి మళ్లీ ఆగస్టు 16న అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. ఆగస్టు 17న అమెరికాలోని డెట్రాయిట్‌లో జరగనున్న ప్రవాసాంధ్రుల సభలో ఆయన పాల్గొని ప్రసంగించనున్నారు.
అమెరికా కాన్సులేట్‌కి ఏపీ సీఎం జగన్... వీసా పనులు పూర్తి - అమెరికా కాన్సులేట్‌కి జగన్
వీసా నిమిత్తం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బేగంపేటలోని అమెరికా కాన్సులేట్‌కి వెళ్లారు. వీసా పనులు పూర్తి చేసుకున్నారు.
అమెరికా కాన్సులేట్‌కి జగన్... వీసా పనులు పూర్తి