ఏపీ ముఖ్యమంత్రి జగన్ రెండ్రోజుల దిల్లీ పర్యటన ముగిసింది. ఈ పర్యటనలో.. కేంద్ర మంత్రులను కలిసి.. రాష్ట్ర ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. నిన్న ఒకసారి కేంద్ర హోం మంత్రి అమిత్ షా ను కలిసిన సీఎం జగన్.. ఇవాళ మరోసారి చర్చించారు. అరగంట పాటు.. రాష్ట్ర ప్రాజెక్టులపై మాట్లాడారు.
ముగిసిన ఏపీ సీఎం దిల్లీ పర్యటన.. నేరుగా తిరుపతికి పయనం - సీఎం జగన్ తాజా వార్తలు
ఏపీ ముఖ్యమంత్రి జగన్ రెండు రోజుల దిల్లీ పర్యటన ముగిసింది. అక్కడి నుంచి నేరుగా సీఎం తిరుపతికి బయల్దేరారు. ఈ రోజు ఉదయం.. కేంద్రమంత్రి అమిత్‌షాను సీఎం కలిశారు. అంతకుముందు కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌తో భేటీ అయ్యారు. పోలవరం ప్రాజెక్టుకు నిధులు, ఇతర ప్రాజెక్టుల నిర్మాణానికి కేంద్రం సహకారంపై చర్చించారు.
ముగిసిన సీఎం దిల్లీ పర్యటన.. నేరుగా తిరుపతికి పయనం
అంతకుముందు.. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌ను కలిశారు. సీఎం వెంట వైకాపా ఎంపీలు ఉన్నారు. పోలవరం ప్రాజెక్టుకు నిధులు, ఇతర ప్రాజెక్టుల నిర్మాణానికి కేంద్రం సహకారం ఇవ్వాలని కోరారు. అనంతరం రాష్ట్రానికి బయలుదేరారు. అక్కడి నుంచి నేరుగా తిరుపతి పయనమయ్యారు.
ఇవీ చదవండి:వ్యవసాయ మార్కెటింగ్‌లో అంకురాలు... వినూత్న మార్గాలతో విజయాలు