వచ్చే విద్యా సంవత్సరం నుంచి 7వ తరగతి వరకూ ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్‌ఈ సిలబస్‌ను బోధించాలని అధికారులను ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. 2024 నాటికి 8, 9, 10 తరగతులకూ వర్తింపజేయాలని, జగనన్న విద్యా కానుకలో ఆంగ్లం-తెలుగు నిఘంటువును చేర్చాలని సూచించారు. దానిని ఉపాధ్యాయులకూ ఇవ్వాలని ఆదేశించారు. ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థులకు ఇచ్చే పుస్తకాల నాణ్యతతో పోటీ పడాలని పేర్కొన్నారు.
ఒకటి నుంచి ఏడో తరగతి వరకు సీబీఎస్‌ఈ: ఏపీ సీఎం జగన్ - సీఎం జగన్ తాజా వార్తలు
మన బడి నాడు-నేడుపై ఏపీ సీఎం జగన్ సమీక్షించారు. ఈ ఏడాదే ఒకటి నుంచి ఏడో తరగతి వరకు సీబీఎస్ఈ విధానం అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. మొదటి దశ నాడు – నేడు పనులు మార్చి నెలాఖరుకల్లా పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో పక్కా భవనాలు లేని 390 పాఠశాలలకు వెంటనే భవనాలు నిర్మించాలని సీఎం ఆదేశించారు. పాఠశాలల్లో మరుగుదొడ్ల శుభ్రతకు 27 వేల మంది ఆయాల్ని నియమించామని, మార్చి మొదటి వారంలో వీరందరికీ శిక్షణ ఇస్తామని అధికారులు సీఎంతో చెప్పారు. నాడు-నేడు తొలిదశ పనుల్ని మార్చి ఆఖరుకు పూర్తి చేయాలని, పాఠశాలలు రంగులతో ఆకర్షణీయంగా ఉండాలని జగన్ ఆదేశించారు. రెండోదశలో మరిన్ని మార్పులు చేయాలని, విద్యార్థుల బల్లలు సౌకర్యవంతంగా ఉండాలని పేర్కొన్నారు.
- సీఎం ఇంకా ఏమన్నారంటే..
-నాడు-నేడు పనుల్లో నాణ్యత కొరవడితే తీవ్రంగా పరిగణించాలి.
-చిన్నారులకు ఎలా బోధించాలనే అంశంపై అంగన్‌వాడీ కార్యకర్తలకు శిక్షణ ఇవ్వాలి. ఉపాధ్యాయులకూ శిక్షణ కొనసాగించాలి. వారు ఎంత నేర్చుకున్నారనే దానిపై రెండు నెలలకోసారి ఆన్‌లైన్ పరీక్షలు నిర్వహించాలి. వాటిలో ఉత్తీర్ణులయ్యారా? లేదా? అనేదానితో సంబంధం లేకుండా శిక్షణ ద్వారా వారు ఎంత మెరుగయ్యారో పరిశీలించాలి.
-అమ్మఒడి పథకానికి బదులుగా ల్యాప్‌టాప్‌ను కోరుకున్న వారికి ఇచ్చేవి నాణ్యతతో ఉండాలి.
ఇదీ చదవండి :కాళేశ్వరం ప్రాజెక్టులో మరో మైలురాయి