పోలవరం డ్యామ్ ఎత్తు ఒక్క మిల్లీమీటరు కూడా తగ్గించట్లేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టును సందర్శించిన ఆయన.. స్పిల్‌వే వద్ద ఏర్పాటు చేసిన ఫొటో గ్యాలరీని పరిశీలించారు. స్పిల్‌వే నిర్మాణం పనులు జరుగుతున్న తీరును సీఎంకు ఇంజినీర్లు వివరించారు. పోలవరం ప్రాజెక్టు సమావేశ మందిరం వద్ద సమీక్ష నిర్వహించిన ఆయన... మే నెలాఖరుకు స్పిల్‌వే, స్పిల్ ఛానల్ పనులు సంపూర్ణంగా పూర్తి కావాలని ఆదేశించారు.
పోలవరం ఎత్తు ఒక్క మిల్లీమీటరు కూడా తగ్గదు: ఏపీ సీఎం జగన్ - ap news
పోలవరం ప్రాజెక్టు పనులను ఏపీ సీఎం జగన్ పరిశీలించారు. అనంతరం అధికారులతో సమీక్షించిన ఆయన... పోలవరం డ్యామ్ ఎత్తు ఒక్క మిల్లీమీటరు కూడా తగ్గించట్లేదని స్పష్టం చేశారు. మే నెలాఖరుకు స్పిల్‌వే, స్పిల్ ఛానల్ పనులు సంపూర్ణంగా పూర్తి కావాలని ఆదేశించారు.
పోలవరం ఎత్తు ఒక్క మిల్లీమీటరు కూడా తగ్గదు: ఏపీ సీఎం జగన్
ముంపునకు గురవుతున్న ప్రాంతాల్లో పునరావాస కార్యక్రమాలకు.. కనీసం రూ.3,330 కోట్లు అవుతుందని అంచనా వేశారు. పోలవరం 41.5 మీటర్ల తొలి దశలోనే 120 టీఎంసీలు నిల్వ చేస్తున్నామని.. డెల్టాకు సాగు, తాగునీటి కొరత రాకుండా చూడాలని ముఖ్యమంత్రి సూచించారు. 2022 ఖరీఫ్ నాటికి సాగునీరు ఇవ్వాలని ఆదేశించారు. వచ్చే జూన్ 15నాటికి గోదావరిలో నీళ్లు వస్తాయన్న సీఎం... ఆ లోపు యుద్ధప్రాతిపదికన పనులు జరగాలని ఆదేశించారు.
ఇదీ చదవండి:'రైతు ధైర్యంగా అడుగేయనంతవరకు ప్రపంచంతో పోటీ పడలేం'