G-20 Summit Strategy meeting : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు నేడు వేర్వేరుగా దిల్లీకి వెళ్లనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగే జీ-20 సదస్సు నిర్వహణపై.. రాజకీయ పార్టీల అధ్యక్షులతో అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఈరోజు సాయంత్రం 5గంటల నుంచి 7గంటల వరకు కొనసాగే ఈ సమావేశం.. రాష్ట్రపతి భవన్‌లో నిర్వహించనున్నారు. ఈ అఖిలపక్ష సమావేశంలో ముఖ్యమంత్రి జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొననున్నారు.
ఏ సమయానికి వెళ్తున్నారంటే. సీఎం జగన్ మధ్యాహ్నం 12గంటల 30 నిమిషాలకు తాడేపల్లి నుంచి బయలుదేరనున్నారు. మధ్యహ్నం 3 గంటల 15 నిమిషాలకు దిల్లీ చేరుకుంటారు. అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న అనంతరం తిరిగి రాష్ట్రానికి బయల్దేరి రానున్నారు. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు ఉదయం 9గంటల 30 నిమిషాలకు హైదరాబాద్ నుంచి బయల్దేరి దిల్లీ వెళ్లనున్నారు. అక్కడ సాయంత్రం 5గంటలకు నిర్వహించే భేటీలో ఆయన పాల్గొననున్నారు.