రాష్ట్రంలోని రైతులందరికీ సరిపోయేంత యూరియాను తక్షణమే సరఫరా చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. మూడు.. నాలుగు రోజుల్లోగా రైతుల డిమాండ్‌కు అనుగుణంగా అన్ని గ్రామాలకు యూరియా పంపిణీ చేయాలని సూచించారు. వివిధ నౌకాశ్రయాల్లో ఉన్న నిల్వలను తక్షణమే రైళ్లు, లారీల ద్వారా తెప్పించాలని... వాటిని స్టాక్ పాయింట్లలో నిల్వ చేయకుండా నేరుగా గ్రామాలకే తరలించాలన్నారు. ఈ సందర్భంగా గతంలో ఎన్నడూ లేనంతగా యూరియా సమస్య తలెత్తడానిక గల కారణాలను వ్యవసాయ శాఖ అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.
మూడు, నాలుగు రోజుల్లో రైతులందరికీ యూరియా: కేసీఆర్ - cm kcr
రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో నెలకొన్న యూరియా కొరతను తక్షణమే నివారించాలని సీఎం కేసీఆర్... అధికారులను ఆదేశించారు. మూడు, నాలుగు రోజుల్లోగా రైతుల డిమాండ్‌కు సరిపడా ఎరువులు అందజేస్తామని తెలిపారు.

'రైతులందరికీ యూరియా అందించాలని సీఎం ఆదేశం'