CM Breakfast Scheme Telangana : రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా అల్పాహారాన్ని అందించేందుకు ఉద్దేశించిన 'ముఖ్యమంత్రి అల్పాహార పథకం(CM Breakfast Scheme)' శుక్రవారం లాంఛనంగా ప్రారంభించనున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి(Sabitha Indrareddy) తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ఒక పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని మంత్రులు, శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు ప్రారంభిస్తారని మంత్రి వెల్లడించారు. మిగిలిన పాఠశాలల్లో దసరా సెలవుల(Dussehra Holidays 2023) తర్వాత ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని విద్యాశాఖ మంత్రి వివరించారు.
CM Breakfast Scheme in Telangana :ఈ పథకం అమలు తీరును పర్యవేక్షించే బాధ్యతను పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ కమిషనర్లు, గ్రామీణ ప్రాంతాల్లో జిల్లా అదనపు కలెక్టర్లకు అప్పగిస్తున్నట్లు తెలిపారు. ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థినీ, విద్యార్థులకు ఉచితంగా అల్పాహారం అందించనున్నామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. విద్యార్థులకు పౌష్టికాహారం అందించడంతో పాటు డ్రాఫ్స్‌వుట్‌లను తగ్గించి, హాజరు శాతాన్ని పెంచడంతో పాటు వారికి చదువు పట్ల శ్రద్ధ కలిగేందుకు ఈ పథకం ఉపయోగపడుతుందని మంత్రి పేర్కొన్నారు.
మధ్యాహ్న భోజన పథకంలో .. పల్లీపట్టి బదులు ఈ సారి మొలకలు, బెల్లం
CM Breakfast Scheme Launch at Raviryal Village : 27,147 పాఠశాలల్లోని దాదాపు 23 లక్షల మంది విద్యార్థులకు ఈ పథకం ద్వారా ప్రయోజనం కలగనుందని మంత్రి వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని రావిర్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంత్రులు హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డి శుక్రవారం ఉదయం 8 గంటలకు ముఖ్యమంత్రి అల్పాహార పథకాన్ని ప్రారంభించనున్నారు. పాఠశాల సమయానికి 45 నిమిషాల కంటే ముందుగానే విద్యార్థులకు అల్పాహారాన్ని వడ్డించనున్నారు. అంతకు ప్రకటించిన దసరారోజు కాకుండా అక్టోబరు 6నే పథకాన్ని లాంఛనంగా ప్రారంభిస్తున్నారు.