నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో అగ్ని ప్రమాద ఘటనపై క్లూస్ టీం ఆరా తీస్తోంది. సంఘటనా స్థలంలో కొన్ని వస్తువులను అధికారులు సేకరించారు. మొదట ఏ స్టాళ్లో అగ్ని ప్రమాదం జరిగిందనే కోణంలో ఆధారాలు సేకరిస్తున్నారు. ప్రమాదానికి షాట్ సర్క్యూట్ కారణమా లేక సిగరెట్ కాల్చి పడేయడమా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
నిమిషాల వ్యవధిలో మంటలు వ్యాపించి స్టాళ్లన్నీ అగ్నికి ఆహుతయ్యాయి. మంటలు త్వరగా వ్యాపించడానికి ముఖ్యం కారణం అగ్నిని త్వరగా ఆకర్షించే వస్తువులు ఉండటమేనని భావిస్తున్నారు