బడ్జెట్ సమావేశాల్లో అంశాలవారీగా ప్రజా సమస్యలను చర్చించేందుకు పని విభజన చేసుకోవాలని సీఎల్పీ నిర్ణయించింది. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నేతృత్వంలో దాదాపు గంటపాటు సమావేశమైన కాంగ్రెస్ నాయకులు... ఈ నిర్ణయం తీసుకున్నట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. రాష్ట్రంలో శాంతిభద్రతలు, న్యాయవాద దంపతుల హత్య, రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు, కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలపై చర్చించి... వాటిని వ్యతిరేకిస్తూ... తీర్మానం చేయాలని నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.
బడ్జెట్ సమావేశాల్లో సమస్యలపై చర్చించేందుకు కాంగ్రెస్ కసరత్తు!
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నేతృత్వంలో కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు. బడ్జెట్ సమావేశాల్లో చర్చించే సమస్యలపై ముందుగానే పని విభజన చేసుకోవాలని సీఎల్పీ నిర్ణయించింది. రాష్ట్రంలో నెలకొన్న పలు సమస్యలను సభలో లేవనెత్తాలని నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
బడ్జెట్ సమావేశాల్లో సమస్యలపై చర్చించేందుకు కాంగ్రెస్ కసరత్తు!
సోమవారం జరిగిన సభకు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మినహా మిగిలిన అందరు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. మరొకసారి సమావేశమై చర్చించి ఎవరెవరు ఏయే అంశాలపై సిద్ధం కావాలన్న అంశంపై చర్చించనున్నట్లు సమాచారం.
ఇదీ చదవండి:సాగు చట్టాలపై సభలో తీర్మానం చేయాలి: భట్టి