తెలంగాణ

telangana

ETV Bharat / state

'నిజాలు చెప్పమంటే.. మంత్రికి భయమెందుకు?' - ఉత్తమ్, జగదీశ్​రెడ్డి మధ్య వాగ్వాదం​పై భట్టి స్పందన

సమస్యల పట్ల ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే మంత్రులు భయపడుతున్నారని ఆరోపించారు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క. ప్రజా ప్రతినిధులు అడిగిన వాటికి సమాధానం చెప్పడం ప్రభుత్వ బాధ్యతని ఆయన గుర్తు చేశారు.

Clp leader on minister jagadish reddy
'ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే భయమెందుకు?'

By

Published : Jun 1, 2020, 10:33 PM IST

పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి పట్ల మంత్రి జగదీశ్​రెడ్డి అనుసరించిన తీరును సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఖండించారు. మంత్రి అప్రజాస్వామిక చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే మంత్రులు ఎందుకు భయపడుతున్నారని నిలదీశారు. ప్రజా ప్రతినిధులు అడిగిన వాటికి సమాధానం చెప్పడం ప్రభుత్వ బాధ్యతన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. రైతుబంధు, రుణమాఫీ అందలేదని ప్రతి సమావేశంలో కచ్చితంగా నిలదీస్తామన్నారు.

ABOUT THE AUTHOR

...view details