ఎల్ఆర్ఎస్ వల్ల రాష్ట్రంలోని పేద, మధ్య తరగతి ప్రజలపై అదనపు భారం పడుతుందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రే స్వయంగా ప్రజలపై భారాలు మోపడానికి.. ప్రభుత్వ ఖజానా నింపుకోవడానికి.. ఇలాంటి స్కీమ్లు ప్రవేశపెట్టడం దారుణమని అన్నారు.
ఎల్ఆర్ఎస్ వల్ల రాష్ట్ర ప్రజలపై అధిక భారం : భట్టి - సీఎం కేసీఆర్
రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉండి.. ప్రజలపై భారాలు మోపడం సరికాదని.. కేసీఆర్ తుగ్లక్ విధానాలకు త్వరలోనే చరమగీతం పాడుతామని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. అసెంబ్లీలోని మీడియా పాయింట్ వద్ద ఆయన ఎల్ఆర్ఎస్ స్కీమ్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఖజానా నింపుకోవడం కోసం.. ప్రజలపై మోపే అదనపు భారమే ఎల్ఆర్ఎస్ అని దుయ్యబట్టారు.
![ఎల్ఆర్ఎస్ వల్ల రాష్ట్ర ప్రజలపై అధిక భారం : భట్టి CLP Leader Mallu Bhatti Vikramarka on LRS Scheme](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9053854-536-9053854-1601881106623.jpg)
ప్రభుత్వం పన్నుల పేరుతో ప్రజల రక్తాన్ని పీలుస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్లాట్ రిజిస్ట్రేషన్ చేసినప్పుడు ఫీజు తీసుకున్న ప్రభుత్వం.. ఇప్పుడు తాజాగా ఎల్ఆర్ఎస్ ఫీజు ఎందుకు అని ఆయన ప్రశ్నించారు. ఎల్ఆర్ఎస్ కట్టకపోతే.. రిజిస్ట్రేషన్లు చేయమని బెదిరించడం సరికాదని.. ప్రభుత్వమే పేదల ఇళ్లను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం చేసిన అప్పులు తీర్చడానికి ప్రజలపై భారాలు మోపుతున్నారని భట్టి ఆరోపించారు. తుగ్లక్ విధానాలు అవలంబిస్తున్న కేసీఆర్ పాలనకు త్వరలోనే చరమగీతం పాడుతామని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజలెవరూ భయపడాల్సిన అవసరం లేదని.. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని.. తెరాస మోపిన అదనపు భారాలన్నీ మాఫీ చేస్తామన్నారు.
- ఇవీ చూడండి: పరువు హత్య: పరారీలో ఉన్న కీలక నిందితుల అరెస్ట్