"కొత్త రెవెన్యూ చట్టంలోనూ లోపాలు ఉన్నాయని సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క అన్నారు.పేదలు భూములు పోగొట్టుకోకుండా సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నట్లు అసెంబ్లీలో సీఎం కేసీఆర్ను భట్టి విక్రమార్క కోరారు. పట్టాలు లేని పేదలకు, భూములకు పట్టాలు ఇవ్వండిని సూచించారు.
సామాజిక తెలంగాణ తెచ్చుకున్న మనం... పేదల సమస్యలను పరిష్కరించాలన్నారు. సాదా బైనామా కింద ఇంకా 2 లక్షల భూములు పెండింగ్‌లో ఉన్నాయని భట్టి గుర్తు చేశారు. అప్‌డేట్ చేసేటప్పుడు సాదాబైనామా భూములను ఎలా నమోదు చేస్తారో స్పష్టత ఇవ్వాలన్నారు. రోజువారీ జమాబంధీ చేస్తుంటేనే పలు సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని పేర్కొన్నారు. పూర్తిస్థాయి అధికారి ఉంటేనే సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు".
- మల్లు భట్టి విక్రమార్క, సీఎల్పీ నాయకుడు.