తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రణబ్‌ను పలుసార్లు కలిశామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క శాసనసభ సమావేశంలో పేర్కొన్నారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చేలా చూడాలని ప్రణబ్‌ను అనేకసార్లు కోరామని పేర్కొన్నారు. దేశం గర్వించే గొప్ప నేత ప్రణబ్ ముఖర్జీ అని కొనియాడారు. ఆయన మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. దేశరాజకీయాల్లో ఆయన చెరగని ముద్ర వేశారని పేర్కొన్నారు.
దేశం గర్వించే గొప్ప నేత.. ప్రణబ్ ముఖర్జీ: భట్టి విక్రమార్క - telangana assembly news
తెలంగాణ శాసనసభ సమావేశాలు ప్రారంభం కాగా... సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రణబ్ ముఖర్జీ మృతికి సంతాపం తెలిపారు. దేశం గొప్ప నేతను కోల్పోయిందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను ప్రణబ్‌కు చెప్పేవాళ్లమని గుర్తు చేసుకున్నారు.
![దేశం గర్వించే గొప్ప నేత.. ప్రణబ్ ముఖర్జీ: భట్టి విక్రమార్క CLP leader Bhatti Vikramarka](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8708426-247-8708426-1599460284995.jpg)
దేశం గర్వించే గొప్ప నేత.. ప్రణబ్ ముఖర్జీ: భట్టి విక్రమార్క
ఉద్యమ సమయంలో అన్ని విషయాలు కేంద్రానికి చేరవేశామని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను ప్రణబ్‌కు చెప్పేవాళ్లమని గుర్తు చేశారు. పదవి ముఖ్యం కాదు.. తెలంగాణ ముఖ్యమని కేసీఆర్ పలుసార్లు చెప్పారని వివరించారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన సంతాప తీర్మానానికి మద్దతు తెలుపుతున్నామని అన్నారు.
దేశం గర్వించే గొప్ప నేత.. ప్రణబ్ ముఖర్జీ: భట్టి విక్రమార్క
ఇదీ చూడండి: రాజకీయ సముద్రాన్ని సమర్థంగా ఈదిన నేత.. ప్రణబ్: కేసీఆర్
Last Updated : Sep 7, 2020, 1:08 PM IST