తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనా రోగులకు వైద్యం అందడం లేదు: భట్టి

రాష్ట్రంలో ప్రజలు భయంతో బతుకుతున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పేర్కొన్నారు. అసలు కరోనా రోగులకు వైద్యం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కొవిడ్ చికిత్సను ఆరోగ్యశ్రీ పథకంలో చేర్చాలని డిమాండ్​ చేశారు.

CLP leader Bhatti Vikramarka Talk about corona treatment in telangana
కరోనా రోగులకు వైద్యం అందడం లేదు: భట్టి

By

Published : Jul 11, 2020, 1:53 PM IST

రాష్ట్ర ప్రజలతో పాటు హైదరాబాద్ నగర ప్రజలు భయంతో బతుకుతున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌లో కరోనా విజృంభిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా వచ్చిన రోగులకు వైద్యం అందుబాటులో లేదని ఆరోపించారు.

ప్రజలందరూ భయంతో బతుకుతుంటే సీఎం చేతులెత్తేసి ఫామ్‌హౌస్‌కు వెళ్లారని విమర్శించారు. ఒక్క రోజులోనే సమగ్ర సర్వే చేసే శక్తి ఉన్న రాష్ట్రానికి కరోనా టెస్టులు చేయడంలో శక్తి రావడం లేదని ధ్వజమెత్తారు.

ఐటీ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో యాప్​ తయారు చేసి పడకల వివరాలు అందులో పొందుపరచాలని డిమాండ్ చేశారు. పేద మధ్య తరగతి కుటుంబాలకు కరోనా ట్రీట్‌మెంట్‌ కోసం ఆరోగ్య శ్రీలో చేర్చాలని డిమాండ్​ చేశారు.

కరోనా రోగులకు వైద్యం అందడం లేదు: భట్టి

ఇదీ చూడండి:ఆస్తికోసం కొడుకుల కుట్ర.. ఆలయంలో తలదాచుకున్న తల్లి..

ABOUT THE AUTHOR

...view details