రాష్ట్ర ప్రభుత్వం ఫీజు బకాయిలు చెల్లించక విద్యాసంస్థలు మూతపడ్డాయని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. రీయింబర్స్‌మెంట్ లేక పేద విద్యార్థులు నష్టపోతున్నారని పేర్కొన్నారు. ఉస్మానియా ఆస్పత్రిలో దారుణమైన పరిస్థితులు ఉన్నాయని... కొత్త భవనాల నిర్మాణం ఏమైందని భట్టి... రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పాతబస్తీకి మొదటి దశలోనే మెట్రోరైలు వసతిని కల్పించాల్సి ఉన్నా.. ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదన్నారు. దళితబంధు తరహాలో ముస్లింలకు కూడా ఇవ్వాలని భట్టి విక్రమార్క విజ్ఞప్తి చేశారు.
batti on minority welfare: దళితబంధు తరహాలో ముస్లింలకు కూడా ఇవ్వాలి: భట్టి - మైనార్టీ వర్గంపై ప్రశ్నించిన భట్టి విక్రమార్క
దళితబంధు తరహాలో ముస్లింలకు కూడా ఇవ్వాలని భట్టి విక్రమార్క విజ్ఞప్తి చేశారు. తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా సంస్థలకు ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయకపోవడం లేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. అందువల్ల రాష్ట్రంలో సుమారు వందకు పైగా కళాశాలలు మూతపడ్డాయని పేర్కొన్నారు. షెడ్యూలు కులాల అభివృద్ధి, అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమం కోసం ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏమయ్యాయని అసెంబ్లీలో భట్టి విక్రమార్క ప్రశ్నించారు.
తెలంగాణ వస్తే ప్రతి మండలంలోను ఎల్కేజీ నుంచి పీజీ వరకు అన్ని వర్గాలకు పనికొచ్చే విధంగా... ఉన్నతమైన విద్యా వ్యవస్థను ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీని అమలు చేయాలి. ఈ విధానం వల్ల ప్రతి మండలంలో ఉన్న మైనార్టీ విద్యార్థులకు అవకాశాలు ఉంటాయి. నూతనంగా ఏర్పడిన రాష్ట్రం నిధులతో హైదరాబాద్‌లోని పాతబస్తీని అభివృద్ధి చేయాలి. హైదరాబాద్ నగరాన్ని ఇస్తాంబుల్‌గా మారుస్తానని.. సీఎం కేసీఆర్ గతంలో చాలా సందర్భాల్లో చెప్పారు. మరి ఆ విషయంలో ఎవరు అడ్డుపడుతున్నారు.? పాతబస్తీని ఇస్తాంబుల్‌గా మార్చండి. పేద, ముస్లిం సోదరులందరికీ, బీపీఎల్‌లో ఉన్న అందరికీ దళితబంధు పథకం అమలు చేయాలి. మైనార్టీల సంక్షేమం కోసం కేటాయించే నిధులు అరకొరగా ఉంటున్నాయి. ఇలా అరకొర నిధులు కేటాయించిన దానిని బట్టి మైనార్టీలకు న్యాయం చేస్తున్నట్టా..? అన్యాయం చేస్తున్నట్టా..? -భట్టి విక్రమార్క, సీఎల్పీ నేత
ఇదీ చూడండి:Telangana CM KCR : 'తెలంగాణ పర్యాటక ప్రగతిని పరుగులు పెట్టిస్తాం'