రాష్ట్రంలో నూతన పీసీసీ అధ్యక్షుడి ఎంపిక వ్యవహారం కాంగ్రెస్ పార్టీలో వాడీవేడి చర్చకు దారి తీస్తోంది. రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మానిక్కం ఠాగూర్ నేతృత్వంలో పార్టీ నేతల అభిప్రాయాల సేకరణ పూర్తయినప్పటికీ.. సీనియర్ నేతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
'సరైన సమయంలో సరైన వ్యక్తి పీసీసీ అధ్యక్షుడు అవుతారు' - పీసీసీ అధ్యక్ష పీఠంపై భట్టి వ్యాఖ్యలు
నూతన పీసీసీ అధ్యక్షుడి ఎంపిక వ్యవహారం కాంగ్రెస్ పార్టీలో ఆసక్తి రేపుతోంది. రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మానిక్కం ఠాగూర్ నేతృత్వంలో పార్టీ నేతల అభిప్రాయాల సేకరణ పూర్తయినప్పటికీ.. సీనియర్ నేతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

రెండు గ్రూపులుగా విడిపోయిన నాయకులు.. ఎవరికి వారు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసుకుని చర్చించుకుంటున్నారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని నూతన అధ్యక్షుడి ఎంపిక ఎలా ఉండాలి..? ఎలాంటి వ్యక్తి అయితే బాగుంటుంది. తదితర అంశాలను వివరించేందుకు దిల్లీ వెళ్లాలని కాంగ్రెస్ సీనియర్ నేతలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో ఈటీవీ భారత్ ప్రతినిధి తిరుపాల్ రెడ్డి ముఖాముఖి.
ఇదీ చదవండి:'డీపీఆర్లు ఎందుకివ్వరు?.. ప్రాజెక్టుల పేరుతో దోచుకుంటున్నారు'