కరోనా వైరస్ వ్యాప్తిని నిలువరించేందుకు ఏకైక మార్గం స్వీయ నియంత్రణ అని, దానిని ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా పాటించాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రజలకు సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రపంచ ఆరోగ్య సంస్థ చేస్తున్న సూచనలు తప్పకుండా పాటించి సమాజ శ్రేయస్సుకు దోహదపడాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
కరోనా వైరస్ ద్వారా సంక్రమించే వ్యాధికి మందులు లేనందున ఆ వ్యాధి రాకుండా నియంత్రణ చర్యలు తీసుకోవడం ఒకటే మార్గమని పేర్కొన్నారు. నిర్లక్ష్యం చేస్తే భారీ మొత్తంలో మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని, ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతను గుర్తెరగాలన్నారు. చాలా దేశాలు నిర్లక్ష్యం చేయడం వల్ల తిరిగి పూడ్చుకోలేని నష్టాన్ని చవి చూశాయని భట్టి గుర్తుచేశారు.