తెలంగాణ

telangana

ETV Bharat / state

Bhatti Vikramarka: వీహెచ్‌ ఆరోగ్యం నిలకడగానే ఉంది: భట్టి విక్రమార్క - తెలంగాణ వార్తలు

హైదర్‌గూడ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కాంగ్రెెస్​ సీనియర్ నేత వి.హనుమంతరావును సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పరామర్శించారు. వీహెచ్‌ ఆరోగ్య పరిస్థితులపై ఆరా తీశారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

Bhatti Vikramarka, vh
వీహెచ్‌, భట్టి విక్రమార్క

By

Published : Jun 30, 2021, 8:54 AM IST

హైదరాబాద్ హైదర్‌గూడ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హనుమంతరావు ఆరోగ్యం నిలకడగా ఉందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలిపారు. వీహెచ్​ను కలిసిన అనంతరం ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నట్లు పేర్కొన్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

భట్టితో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు వీహెచ్‌ను పరామర్శించారు. ఇప్పటికే పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ఆస్పత్రికి వెళ్లి పరామర్శించి రాగా మంగళవారం ఉదయం నుంచి పలువురు నాయకులు ఆస్పత్రికి వరుసకట్టారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ అజారుద్దీన్‌, మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్‌... వీచ్‌ను పలకరించారు.

గురువారం నుంచి కిడ్నీ సమస్యతో బాధపడుతూ... ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న హనుమంతరావు ఆరోగ్యంపై వైద్యులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితులను ఆరా తీశారు. ఆయన త్వరగా కోలుకోవాలని నేతలు ఆకాంక్షించారు.

ఇదీ చదవండి:Double Bedroom houses: "పట్టణాల్లో వడివడిగా.. పల్లెల్లో నెమ్మదిగా"

ABOUT THE AUTHOR

...view details