తెరాస, భాజపాలు రెండు తోడు దొంగలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. ఆ రెండు పార్టీలు పరస్పరం దాడులు చేసుకుంటూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో లబ్ది పొందాలని చూస్తున్నాయని విమర్శించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా దేశంలో 45 శాతం నిరుద్యోగం వెంటాడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఏటా రెండు కోట్లా ఉద్యోగాలు ఇస్తామన్న ప్రధాని నరేంద్ర మోదీ...ఇవ్వకపోగా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను కూడా అమ్మేస్తున్నారని ఆరోపించారు.
యువతపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కక్షసాధింపు ధోరణి: భట్టి - telangana varthalu
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మండిపడ్డారు. యువతపై ప్రభుత్వాలు కక్షసాధింపు ధోరణిని అవలంభిస్తున్నాయని ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు సరైన బదులివ్వాలని కోరారు.
యువతపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కక్షసాధింపు ధోరణి: భట్టి
ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా బడుగు బలహీన వర్గాలకు ఉద్యోగాలు వచ్చేవని, ఇప్పుడు ప్రైవేటుకు ఇవ్వడం మూలాన ఎస్సీ, ఎస్టీలకు ఉద్యోగాలు రాకుండా పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక్కడ పీఆర్సీ కమిషన్ లక్షా 90వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు చెప్పగా... మంత్రి కేటీఆర్ తప్పుడు లెక్కలు చెబుతూ మభ్యపెడుతున్నారని ఆరోపించారు. భాజపా, తెరాసలకు రాబోయే ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని ఓటర్లను కోరారు.
ఇదీ చదవండి: న్యాయవాద దంపతుల హత్యలపై సీఎం స్పందించరేం: బండి
Last Updated : Mar 2, 2021, 5:45 PM IST