శాసనసభలో తమను మాట్లాడనీయకుండా చేయడంతో పాటు అర్ధాంతరంగా మైకును కట్ చేయడం అవమానకరంగా ఉందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఈ ప్రక్రియ ప్రజాస్వామ్య స్ఫూర్తికి పూర్తి విరుద్ధమని ఆవేదన వ్యక్తం చేశారు. భట్టి నేతృత్వంలో కాంగ్రెస్ నేతలు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు.
సభా హక్కుల ఉల్లంఘనపై స్పీకర్‌కు భట్టి వినతిపత్రం - bhatti vikramarka news
శాసనసభలో తనను మాట్లాడనీయకుండా చేయడం అవమానకరంగా ఉందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి ఈ ప్రక్రియ విరుద్ధంగా ఉందని అన్నారు. ఈ విషయంపై స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిని కలిసి కాంగ్రెస్ నేతలు వినతి పత్రం సమర్పించారు.
భట్టి విక్రమార్క
కొన్ని సందర్భాల్లో సభ్యుల ఫిరాయింపులపై స్పీకర్‌కు లేఖ ఇచ్చే సందర్భంలో ప్రతిపక్ష నాయకుడిగా ఫొటోకు కూడా అంగీకరించికపోవడం.. తనను తీవ్రంగా కలచివేసిందని వినతిపత్రంలో భట్టి ప్రస్తావించారు. స్పీకర్‌ను కలిసిన వారిలో ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, పొదెం వీరయ్య, సీతక్క ఉన్నారు.
ఇదీ చదవండి:సభలో.. మాకూ మాట్లాడే అవకాశమివ్వండి: కాంగ్రెస్ నేతలు