దేశంలో మతాల మధ్య చిచ్చు ఏర్పడకుండా ఆపాల్సిన పాలకులే ఇప్పుడు మతాలు, కులాలకు చిచ్చుపెట్టి రాజకీయ లబ్ది పొందాలని చూడడం సిగ్గుచేటని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. మనుషుల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ లబ్ది పొందుతున్న పార్టీలకు బుద్ది చెప్పాలని కోరారు. దేశంలో సాంకేతిక విప్లవం గురించి మాట్లాడాల్సి వస్తే.. స్వర్గీయ రాజీవ్ గాంధీ, శ్యామ్ పిట్రోడాల గురించి మాట్లాడకుండా ఉండలేమని ఆయన పేర్కొన్నారు.
21వ శతాబ్దంలో అభివృద్ధి గురించి 30 ఏళ్ల కిందనే ఆలోచించిన మహనీయులు వారని కొనియాడారు. దేశంలో మత హింసలు చెలరేగినప్పుడు, మనుషుల మధ్య విభేదాలు వచ్చినపుడు ఇలాంటి యాత్రలు తత్సంబంధాలు పెంపొందించేందుకు దోహదం చేస్తాయన్నారు.