తెలంగాణ

telangana

ETV Bharat / state

రేషన్, నిత్యావసరాలు ఇళ్లకే చేరవేయాలి: సీఎల్పీ నేత భట్టి - పేదలకు రేషన్ ఇవ్వాలన్న భట్టి

పేదలకు రేషన్, నిత్యావసరాలు పంపిణీ చేయాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కోరారు. వాటిని ఇళ్లకే చేరవేయాలన్నారు.

Clp leader bhatti on poor people
'లాక్​డౌన్​లో పేదలకు రేషన్ అందజేయండి'

By

Published : Mar 30, 2020, 12:08 PM IST

కరోనా వ్యాప్తి నిరోధానికి చేపట్టిన లాక్​డౌన్‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే పేదలకు రేషన్‌ అందించాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విజ్ఞప్తి చేశారు. అవసరమైన నిత్యావసరాలు ఇళ్లకే సరఫరా చేయాలని కోరారు. నగరాల్లో, పట్టణాల్లో... ప్రజలు బయటకు రాకుండా చర్యలు తీసుకుంటున్నందున అవసరమైన కూరగాయలు, ఇతరత్ర ఇళ్లకే చేరవేయాలని సూచించారు. శానిటైజర్లు, మాస్క్​లు, గ్లౌజులు వాడమని నిపుణులు చెబుతున్నారని... వాటి ఉత్పత్తి పెంచేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు.

'లాక్​డౌన్​లో పేదలకు రేషన్ అందజేయండి'

ABOUT THE AUTHOR

...view details