లాక్డౌన్ రోజుల్లో వలసకూలీలు ఇబ్బంది పడకుండా... రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విజ్ఞప్తి చేశారు. వలసకూలీలకు పని దొరక్క సొంత గ్రామాలకు కిలోమీటర్ల మేర నడుచుకుంటూ.. వెళ్తున్నారని తెలిపారు. మార్గమధ్యలో ఉన్న గ్రామాల్లో వారిని రానివ్వడం లేదన్నారు. కూలీలు ఆకలికి అలమటించి చనిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. వలసకూలీలను ఎక్కడి వాళ్లకు అక్కడే షెల్టర్ ఏర్పాటు చేసి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
వలస కూలీలకు షెల్టర్లు ఏర్పాటు చేయాలి: సీఎల్పీ నేత భట్టి - లాక్డౌన్లో వలసకూలీల కష్టాలు
వలసకూలీలకు ప్రభుత్వం తక్షణమే షెల్టర్లు ఏర్పాటు చేయాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. లేకపోతే వారు ప్రాణాలు కోల్పోయే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు.
'వలసకూలీలకు షెల్టర్లు ఏర్పాటు చేయండి'