హైదరాబాద్ నగరంలో లక్ష ఇళ్లు నిర్మించి పంచుతున్నామని మంత్రి కేటీఆర్ చెప్పారని.. కానీ తనకు 3,428 ఇళ్లు మాత్రమే చూపించారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. గ్రేటర్ హైదరాబాద్‌లో 2 లక్షల 60 వేల ఇళ్లు రావాలన్నారు.
మంత్రి తలసానికి నిజం తెలియదు.. అందుకే ఛాలెంజ్ చేశారు: భట్టి
హైదరాబాద్‌లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంచాయితీ బట్టబయలైందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. హైదరాబాద్ నగరంలో లక్ష ఇళ్లు నిర్మించి పంచుతున్నామని మంత్రి కేటీఆర్ చెప్పారని.. కానీ కాగితాల మీద చూపించిన లెక్కలు క్షేత్రస్థాయిలో చూపించడం లేదని వెల్లడించారు.
'చెప్పే మాటలు వేరు..క్షేత్ర స్థాయిలో ఉన్నది వేరు'
కాగితాల మీద చూపించిన లెక్కలు క్షేత్రస్థాయిలో చూపించడం లేదన్నారు. నగరంలో లక్ష డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంచాయితీ బట్టబయలైందన్నారు. లక్ష ఇల్లు కట్టలేదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు తెలియక తనతో ఛాలెంజ్ చేశారని భట్టి పేర్కొన్నారు. హైదరాబాద్‌లో భూములని చూపిస్తే ఇళ్లు కట్టిస్తామని చెబుతున్నారంటే హైదరాబాద్‌లో లక్ష ఇళ్లు కట్టలేదని ఒప్పుకున్నట్లేనని విక్రమార్క అన్నారు.
ఇదీ చూడండి :ఫార్మా సిటీ వెనక ఉన్న ప్రజాప్రయోజనాలు ఏంటి: భట్టి
Last Updated : Sep 21, 2020, 8:15 PM IST