ఎస్సీ విభాగం బలోపేతం అయితేనే కాంగ్రెస్ బలపడుతుందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఎస్సీలు ఆత్మగౌరవంతో బతికేలా హస్తం పార్టీ పాలించిందని తెలిపారు. దశాబ్దాలుగా కాంగ్రెస్ పాలన వల్లే రిజర్వేషన్లు పొంది చైతన్యవంతులమయ్యామని భట్టి పేర్కొన్నారు.
ఆ విషయంలో కేసీఆర్, మోదీ ఇద్దరూ సమానమే: భట్టి - టీపీసీసీ ఎస్సీ విభాగం
హైదరాబాద్ గాంధీభవన్లో టీపీసీసీ ఎస్సీ విభాగం ఛైర్మన్గా ప్రీతమ్ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు. ఎస్సీ విభాగం బలోపేతం అయితేనే కాంగ్రెస్ బలపడుతుందని వ్యాఖ్యానించారు.
ఆ విషయంలో కేసీఆర్, మోదీ ఇద్దరూ సమానమే: భట్టి
ఆరు దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో... ఈ దేశంలో ఎవ్వరు భయపడుతూ బతకలేదని చెప్పారు. ఆరేళ్ల భాజపా పాలనలో లక్షలాది మంది భయంతో బతికే పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. గాంధీభవన్లో టీపీసీసీ ఎస్సీ విభాగం ఛైర్మన్గా ప్రీతమ్ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో భట్టి మాట్లాడారు. ప్రజల్ని మోసం చేయడంలో కేసీఆర్, మోదీ ఇద్దరు సమానమేనని విమర్శించారు.
ఇవీ చూడండి:పేస్టు రూపంలో బంగారం స్మగ్లింగ్