ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో కాంగ్రెస్ కరోనా అనడం మంచి సంప్రదాయం కాదన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. శాసనసభ ప్రాంగణంలో ఆయన మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. సభలో మమ్మల్ని అవహేళన చేయడం ఎంత వరకు సమజంసమని ప్రశ్నించారు.
సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై స్పీకర్‌కు ఫిర్యాదు: భట్టి - భట్టి విక్రమార్క
శాసనసభలో కాంగ్రెస్ కరోనా అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై స్పీకర్‌కు ఫిర్యాదు చేసినట్లు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలిపారు. తమను 'ఇతర ఎమ్మెల్యేల శవాల మీద పేలాలు ఏరుకుంటారు' అంటూ చేసిన వ్యాఖ్యలపై భట్టి అభ్యంతరం వ్యక్తం చేశారు.
ప్రపంచ దేశాలు కరోనా పట్ల ఇప్పటికే అప్రమత్తమై అన్ని జాగ్రత్తలు తీసుకున్నాయన్నారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా 120మంది ఎమ్మెల్యేలు, 38 మంది ఎమ్మెల్సీలు వారి సిబ్బంది, అధికారులు, సెక్యూరిటీ, పోలీసులు ,మీడియా ఇంతమంది శాసనసభ ఆవరణలో సంచరిస్తున్నా, ప్రభుత్వం కనీస జాగ్రత్తలు తీసుకోలేదని భట్టి ఆక్షేపించారు. లోపలికి వచ్చే వారిని అనుక్షణం తనిఖీ చేసి పంపుతున్న సెక్యూరిటీ సిబ్బందికి, విజిటర్స్‌కు కనీసం శానిటేషన్ అందుబాటులో లేని పరిస్థితి ఉందన్నారు. ఇటువంటి విషయాలపై సభలో చెప్పే ప్రయత్నం చేస్తే మమ్ముల్ని ముఖ్యమంత్రి అవహేళన చేయడం బాగాలేదన్నారు.
ఇవీ చూడండి: మార్చి 31 వరకు అన్ని విద్యాసంస్థలు, థియేటర్లు, బార్లు బంద్: కేసీఆర్