batti letter to cm kcr: కొవిడ్ మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కోరారు. మహమ్మారి బారిన పడి మృతిచెందిన వారి కుటుంబాలకు రూ.50వేల ఎక్స్‌గ్రేషియా సరిపోదని... 4లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు.
బాధిత కుటుంబాలకు నాలుగు లక్షల రూపాయల పరిహారం ఇచ్చే పరిస్థితి లేదని కేంద్రం వాదిస్తుందని.. ఇది సరైన వాదన కాదని భట్టి విక్రమార్క అభ్యంతరం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం 75శాతం, రాష్ట్ర ప్రభుత్వం 25శాతం పరిహారం ఇవ్వాలని నిర్ణయించుకున్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పదల్చుకుందో స్పష్టం చేయాలన్నారు.
50 వేలు పరిహారం ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం
కరోనా మరణించిన వారికి జిల్లా కలెక్టర్లు పరిహారం మంజూరు చేయనున్నారు. ఈ మేరకు వారికి అధికారాలను కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసింది. రాష్ట్ర విపత్తు నిర్వహణ నిధి నుంచి కొవిడ్ మృతుల కుటుంబ సభ్యులకు రూ.50వేల రూపాయల పరిహారాన్ని చెల్లించనున్నట్లు వెల్లడించింది. దరఖాస్తు చేసుకున్న వారికి 30 రోజుల్లోపే పరిహారం అందించాలని జీవోలో పేర్కొంది
మీసేవాలో అన్ని పత్రాలు సమర్పించాలి
మీసేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం పేర్కొన్న అన్ని పత్రాలను మృతుల కుటుంబ సభ్యులు ఆన్ లైన్లో సమర్పించాలని సూచించింది. దరఖాస్తులు పరిశీలించిన తర్వాత అర్హులైన వారికి జిల్లా కలెక్టర్ పరిహారాన్ని మంజూరు చేస్తారని వెల్లడించింది. పరిహారం మొత్తాన్ని ఆధార్‌తో అనుసంధానమైన కుటుంబ సభ్యుల బ్యాంక్ అకౌంట్‌కు బదిలీ చేయనున్నట్లు జీవోలో పేర్కొంది. ఈ మేరకు అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది.
ఇదీ చూడండి:Guidlines For Covid Exgratia: కొవిడ్ మృతులకు రూ.50 వేల పరిహారం.. సర్కారు జీవో