తెరాస ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి, సీఎల్పీని విలీనం చేసిందని కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత భట్టివిక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన వారిపై అనర్హత వేటు వేయాలని తామిచ్చిన పిటిషన్ను పెండింగ్లో ఉంచి ఆ ఎమ్మెల్యేలను విలీనం చేస్తూ నిర్ణయం తీసుకోవడం రాజ్యాంగాన్ని అవమానించడమేనన్నారు. పార్టీ కోసం కాకుండా ప్రజాస్వామ్య పరిరక్షణకై ఈ విషయంలో పోరాటం చేస్తామంటున్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో ఈటీవీ భారత్ ముఖాముఖి...
"పార్టీ కోసం కాదు... ప్రజాస్వామ్యం కోసం పోరాడతాం"
తమ పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలను తెరాస శాసన సభాపక్షంలో విలీనం చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. చట్ట బద్ధత లేకుండా చేసిన ఈ ప్రక్రియపై ఆందోళనకు కాంగ్రెస్ నాయకత్వం సన్నద్ధమవుతోంది.
clp leader batti vikramarka interview