తెలంగాణ

telangana

ETV Bharat / state

'మార్చి నాటికి రూ.3,18,918 కోట్లకు చేరిన అప్పు' - batti news

తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేశారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. రాష్ట్రం ఏర్పడే నాటికి రూ.69వేల కోట్లు అప్పులుంటే.... ఈ ఏడాది మార్చి నాటికి రూ.3లక్షల 18వేల 918 కోట్లకు చేరిందని విమర్శించారు.

clp leader batti vikramarka fire on trs govt on frbm limit
ఆర్డినెన్స్‌తో ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిని పెంచుకున్నారు: భట్టి

By

Published : Aug 25, 2020, 5:14 PM IST

Updated : Aug 25, 2020, 8:37 PM IST

తెలంగాణలో తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుల రాష్ట్రంగా మార్చారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. రాష్ట్రం ఏర్పాటు నాటికి కేవలం రూ.69వేల కోట్లు మాత్రమే అప్పులుండేవని.. ఈ ఏడాది మార్చి నాటికి రూ.3,18,918 కోట్లకు చేరిందని విమర్శించారు. తాజాగా ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిని ఐదు శాతానికి పెంచుకుని ఏడాదికి రూ. 50వేల కోట్లు అప్పు తెచ్చుకునేందుకు ఆర్డినెన్స్ తెచ్చారని ఆరోపించారు.

ఆర్డినెన్స్‌తో ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిని పెంచుకున్నారు: భట్టి

రాబోయే కాలంలో అప్పులు రూ.6 లక్షల కోట్లు తీసుకురావడానికి ప్రణాళికలు రూపొందించుకున్నారని.. అదే జరిగితే వడ్డీ రూపేణా రూ.80వేల కోట్లు చెల్లించాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. భవిష్యత్‌లో ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితులు ఏర్పడతాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులకు సంబంధించి పూర్తి స్థాయిలో నివేదికను పీసీసీకి అందజేయనున్నట్లు తెలిపారు. కరోనాను ఆరోగ్య శ్రీలో చేర్చి పేదలకు ఉచితంగా చికిత్స అందించాలన్నారు.

ఇవీ చూడండి:కృష్ణా బేసిన్‌లో నిండు కుండల్లా జలాశయాలు

Last Updated : Aug 25, 2020, 8:37 PM IST

ABOUT THE AUTHOR

...view details