కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను మోసం చేస్తున్నాయని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. ఐటీఐఆర్ వల్ల లక్షల మందికి ఉపాధి కల్పించే అవకాశం ఉన్నా.... గాలికి వదిలేశాయని విమర్శించారు. కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉపాధి కల్పించడంలో తెరాస ప్రభుత్వం విఫలమైందని ధ్వజమెత్తారు. రెండు ప్రభుత్వాలూ యువతను మోసం చేశాయని విమర్శించారు. యూపీఏ మంజూరు చేసిన ప్రాజెక్టులను భాజపా విస్మరించిందని హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆరోపించారు.
తెరాస, భాజపా కలిసి తెలంగాణ యువతను మోసం చేశాయి: భట్టి విక్రమార్క - తెలంగాణ వార్తలు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ యువతను మోసం చేశాయని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాలని కోరారు. పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరల పెరుగుదలకు నిరసనగా సైకిల్‌పై ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారయాత్ర చేయనున్నట్లు తెలిపారు.
తెరాస, భాజపా కలిసి తెలంగాణ యువతను మోసం చేశాయి: భట్టి విక్రమార్క
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు పార్టీలకు యువత బుద్ధి చెప్పాలని అభిప్రాయపడ్డారు. పెట్రోల్, డీజిల్ ధరలను కేంద్రం విపరీతంగా పెంచి.. పేద, మధ్య తరగతి ప్రజల వెన్ను విరుస్తోందని ధ్వజమెత్తారు. మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఈ నెల 7 నుంచి 14 వరకు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రచారం చేస్తారని తెలిపారు. పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరల పెరుగుదలకు నిరసనగా లోక్‌సభ పరిధిలో సైకిల్‌పై ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారయాత్ర చేయనున్నట్లు వివరించారు.
TAGGED:
hyderabad district news