తెలంగాణ

telangana

ETV Bharat / state

'సీఎం కేసీఆర్​ ప్రతీ మాటలో గెలుపు అహంకారమే...' - MALLU BATTI VIKRAMARKA FIRE ON CM KCR IN TELUGU

సీఎం కేసీఆర్​ వ్యాఖ్యలపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సీఎం మాట్లాడిన ప్రతీ మాటలో గెలుపు అహంకారమే కనిపించిందని ఆరోపించారు. ఆర్టీసీని లేకుండా చేయాలన్న కేసీఆర్​ కుట్ర బయటపడిందని స్పష్టం చేశారు.

CLP LEADER BATTI VIKRAMARKA FIRE ON CM KCR

By

Published : Oct 25, 2019, 7:14 PM IST

ఆర్టీసీ కార్మికుల సమ్మెపై సీఎం కేసీఆర్​ మాట్లాడిన ప్రతీమాటలో గెలుపు అహంకారం ప్రతిధ్వనించిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. రాష్ట్రాన్ని తన గుప్పెట్లో పెట్టుకోవాలనే ధోరణి ఎక్కువగా కనిపించిందన్నారు. సీఎం కేసీఆర్‌కున్న ముసుగు నిన్నటితో తొలగిపోయిందన్న భట్టి... ఆర్టీసీని లేకుండా చేయాలన్న కుట్ర తేటతెల్లమవుతోందన్నారు. సామాన్యులు, కార్మికుల బాధలు పనికిమాలినవిగా కనిపిస్తున్నాయా అంటూ ప్రశ్నించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత సీఎంపై ఉందని గుర్తు చేశారు. ఆస్తులన్నీ అమ్మకానికి పెట్టి... చివరకు రాష్ట్రాన్ని తాకట్టులో పెడతారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 28 లోపు కార్మికులతో చర్చలు జరిపి సమస్యను పరిష్కరిస్తారని ఆశిస్తున్నట్లు భట్టి విక్రమార్క తెలిపారు.

'సీఎం కేసీఆర్​ ప్రతీ మాటలో గెలుపు అహంకారమే...'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details