తెలంగాణ

telangana

ETV Bharat / state

హస్తకళలు, చేనేత ఎగుమతి సంస్థ మూసివేత - తెలంగాణ తాజా వార్తలు

హస్తకళలు, చేనేత ఎగుమతి సంస్థ మూసివేతకు నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర జౌళి శాఖ మంత్రి స్మృతి ఇరానీ పేర్కొన్నారు. జౌళి శాఖలోని పలు సంస్థల మూసివేతకు నిర్ణయం తీసుకున్నారా అని రాజ్యసభలో ఎంపీ నరన్‌భాయ్ జె రత్వా అడిగిన ప్రశ్నకు ఆమె రాతపూర్వక సమాధానం ఇచ్చారు.

Closure of handicrafts and handloom export company
హస్తకళలు, చేనేత ఎగుమతి సంస్థ మూసివేత

By

Published : Mar 18, 2021, 9:23 PM IST

హస్తకళలు, చేనేత ఎగుమతి సంస్థ మూసివేతకు నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర జౌళి శాఖ మంత్రి స్మృతి ఇరానీ స్పష్టం చేశారు. కేంద్ర క్యాబినెట్ గత మంగళవారం అందుకు ఆమోదం తెలిపినట్లు ఆమె వెల్లడించారు. జౌళి శాఖలోని పలు సంస్థల మూసివేతకు నిర్ణయం తీసుకున్నారా అని రాజ్యసభలో ఎంపీ నరన్‌భాయ్ జె రత్వా అడిగిన ప్రశ్నకు ఆమె రాతపూర్వక సమాధానం ఇచ్చారు. ఈ సంస్థ సుదీర్ఘకాలంగా నష్టాల్లో ఉండటంతో మూసివేయాలని నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రమంత్రి స్మృతి ఇరానీ తెలిపారు.

సైన్యంతోపాటు పౌర దుస్తుల ఉత్పత్తి చేసే బ్రిటిషు ఇండియా కార్పొరేషన్ లిమిటెడ్​ను మూసివేసే ప్రతిపాదన.. తుది దశలో ఉందని స్మృతి ఇరానీ పేర్కొన్నారు. బీఐసీఎల్​ను 1981లో జాతీయం చేయగా.. నాటి నుంచి నష్టాల్లో ఉందని.. 1992లో ఖాయిలా పడిందని కేంద్రమంత్రి తెలిపారు. లాభాల బాట పట్టించేందుకు 2001, 2005, 2011లో చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని వివరించారు.

ఇదీ చూడండి :'పెండింగ్​ నిధులు విడుదల చేయాలి'

ABOUT THE AUTHOR

...view details